కాకరకాయ బజ్జిలు తిన్నారా ఎప్పుడు అయినా

 కాకరకాయ బజ్జిలు రెసిపీ

నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం కాకరకాయ బజ్జిలు ఎలా తయారు చేస్తారు అని ఒక లుక్ వేద్దాం పదండీ. మనం ఇప్పటివరకు మిరపకాయ బజ్జిలు, ఆలు బజ్జిలు ఎన్నో రకాలు బజ్జిలు చూసాం మరియు తిన్నాం అయితే ఇప్పుడు ఈ కాకరకాయ బజ్జిలు బాగుంటాయా లేదా అనేది ఒకసారి చేసుకొని తింటే తప్ప తెలీదు.
కాకరకాయ బజ్జిలు 



కాకరకాయ బజ్జిలు చేయడానికి కావలసినవి

కాకరకాయ బజ్జిలు చేయడానికి ఏమేమే కావాలి అనుకుంటున్నారు. తెలుసుకుందాం పదండీ.
  • కాకరకాయ
  • శనగ పిండి
  • మొక్కజొన్న పిండి
  • కారం
  • రుచికి తగినంత ఉప్పు
  • నూనె

తయారీ విధానం :-

  1. ముందుగా మనం ఒకటి రెండు కాకరకాయ తీసుకొని చిన్నగా మరియు రౌండ్ గా ముక్కలు కట్ చేసుకోవాలి. తరువాత లోపల ఉన్న విత్తనాలు అన్ని తీసి నీళ్ళల్లో బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక కప్ మొక్కజొన్న పిండి మరియు రెండు కప్ లు శనగ పిండి కొంచెం కారం అలాగే ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అయితే పిండి మందంగా కాకుండా కొంచం నీళ్లలాగా ఉండాలి.
  3. ఇప్పుడు ఆ మిశ్రమంలో కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అందులో వేసుకోవాలి.
  4. ఒక కడాయి లో వంటనునే పోసి బాగా వేడి అయినా తరువాత ఇప్పుడు కాకరకాయ ముక్కలు పిండిలో అద్ది నూనెలో వేయాలి.
ఇది ప్రాసెస్ అండి మీరూ కూడా ఎవరైనా కాకరకాయ బజ్జిలు తిని ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.

మంచి ఆహారం ఆరోగ్యానికి మంచిది 

Comments

Popular posts from this blog

నెల్లూరు పెద్దిరెడ్డి చేపల పులుసు కీ ఎందుకు అంత డిమాండ్

ఆహారం అలవాటు పరిచయం

బడి హౌస్ చిరు ధాన్యల బ్రేక్ఫాస్ట్ తిన్నారా ఎప్పుడు అయినా